పోలవరం నిర్మాణానికి రూ.12 వేల కోట్లు: రాష్ట్రపతి ముర్ము

పోలవరం నిర్మాణానికి రూ.12 వేల కోట్లు: రాష్ట్రపతి ముర్ము

ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకోసం రూ.12వేల కోట్లు కేటాయించినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి.. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు నదులను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో 30 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, ఆదివాసీల్లో సికిల్ సెల్ అనీమియాను నివారిస్తున్నామని తెలిపారు. దేశంలో 1.75 లక్షల ప్రజా ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్లు ప్రసంగంలో తెలిపారు.

 భారత్ స్పోర్ట్స్ నుంచి స్పేస్ వరకు దూసుకుపోతోందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. దేశ వ్యాప్తంగా  మెడికల్ సీట్ల పెంపు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. టెలీ మెడిసిన్, మెడికల్ డివైజెజ్ తయారీని వృద్ధి చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు డిజిటల్ పేమెంట్స్ తీసుకెళ్లిందని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు చిరు వ్యాపారులే కీలకమని.. డిజిటల్ పేమెంట్స్ లో రికార్డులు సాధించామని గుర్తు తెలిపారు. 

ALSO READ : AI, డిజిటల్ టెక్నాలజీలో ప్రపంచానికి ఆదర్శంగా భారత్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఢిల్లీలో మెట్రో వ్యవస్థను విస్తరిస్తున్నామని,  దేశంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జి జమ్మూకశ్మీర్ లో నిర్మించామని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.  దేశంలో పౌర విమానయానం రంగం అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా తెలిపారు.