AI, డిజిటల్ టెక్నాలజీలో ప్రపంచానికి ఆదర్శంగా భారత్ నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో 70 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచిత ఆరోగ్య భీమా అందించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించిన రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంలో భాగంగా భారత్ ఇన్నోవేషన్ పవర్ హౌజ్ గా మారుతోందని ఆమె అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు:
- 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత ఆరోగ్య భీమా
- భారతీయులు అంతరిక్షంలో అడుగుపెట్టే రోజు ఎక్కువ దూరంలో లేదు
- ఏఐ, డిజిటల్ టెక్నాలజీలో ప్రపంచానికి ఆదర్శంగా భారత్
- ఇండియా ఏఐ మిషన్ ను ప్రారంభించుకున్నాం
- స్పేస్ డాకింగ్ తో అంతరిక్షంలో మరో ముందడుగు వేశాం
- 100 రాకెట్ ప్రయోగాలతో ఇస్రో భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసింది
- నేషనల్ రీసర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం
- మేకిన్ ఇండియాతో అద్భుతాలు సాధిస్తున్నాం
- ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించాం
- మధ్య తరగతి కుటుంబాలకు హోమ్ లోన్స్ ఇస్తున్నాం
- సైబర్ సెక్యూరిటీ, డీప్ ఫేస్ మోసాల నివారణకు ప్రత్యేక చర్యలు
- బ్యాంకింగ్ లో డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చాం
- మారుమూల ప్రాంతాలకు డిజిటల్ పేమెంట్స్ చేరవేశాం
- మహిళల సాధికారత కోసం డ్రోన్ దీదీ స్కీం తీసుకొచ్చాం
- MSME ల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్స్ తీసుకొచ్చాం.