జూన్ 5న కేంద్ర మంత్రులకు రాష్ట్రపతి విందు

జూన్ 5న కేంద్ర మంత్రులకు రాష్ట్రపతి విందు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్డీఏ సర్కారు పదవీ కాలం ముగియనుండటంతో కేంద్ర కేబినేట్ మంత్రులకు రాష్ట్రపతి ద్రౌపది  ముర్ము బుధవారం విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి భవన్ లో రాత్రి 8 గంటలకు ఈ విందును ఏర్పాటు చేశారు. లోక్ సభ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఈ డిన్నర్ పార్టీని హోస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఇతర మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారని తెలుస్తోంది.