21న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

21న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
  • హైదరాబాద్​లో రెండు రోజులు 
  • కోటి దీపోత్సవం, లోక్ మంతన్ కార్యక్రమాలకు హాజరు
  • ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21, 22న హైదరాబాద్‌‌లో పర్యటించనున్నారు. 21న సాయంత్రం హాకీంపేట ఎయిర్‌‌పోర్ట్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. 22న హైటెక్ సిటీ‌‌లోని శిల్పకళా వేదికలో లోక్ మంతన్ -2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. 

రాష్ట్రపతి రెండ్రోజుల పాటు సిటీలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్  ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసు శాఖ తగిన బందోబస్తు ప్రణాళికను రూపొందించాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ సహాయక సిబ్బందితో పాటు అర్హులైన వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని సూచించారు.