రాజ్యాంగం భారతదేశ పవిత్ర గ్రంథం

రాజ్యాంగం భారతదేశ పవిత్ర గ్రంథం

పేదల జీవన విధానం మెరుగు పర్చేందుకే రాజ్యాంగం రూపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 2015 నవంబర్ 26 నుంచి రాజ్యాంగ వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్ రాజ్యంగ రూపకల్పనలో మార్గదర్శకులన్నారు.  ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని... వికసిత్ భారత్ 2047 లక్షంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు రాష్ట్రపతి. సమాజానికి రాజ్యంగం మూలస్థంబం లాంటిదన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో బీఎన్ రావు కీలక భూమిక పోషించారని తెలిపారు 

Also Read :- మహారాష్ట్ర సీఎం షిండే రాజీనామా..ఫడ్నవిస్కు లైన్ క్లియర్

రాజ్యాంగం అమలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ లో  రాజ్యాంగ  దినోత్సవ వేడుకలను రాష్ట్ర పతి  ప్రారంభించారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా   సంస్కృతం, మైథిలీ భాషలో ప్రతులను రిలీజ్ చేశారు రాష్ట్రపతి.   ఇవాళ్టి నుంచి దేశ వ్యాప్తంగా ఏడాదిపాటు రాజ్యాంగ దినోత్స వేడుకలు జరగనున్నాయి.