న్యూఢిల్లీ, వెలుగు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పర్యటించను న్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనను వెలువరించింది. రాష్ట్రపతి మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలు దేరుతారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టుకు రానున్నారు. ఆ తర్వాత మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొంటారు.
అనంతరం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.18న రాష్ట్రపతి నిలయంలో పలు కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాప నలు చేస్తారు. ఈ నెల 20న సికింద్రాబా ద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్లో రాష్ట్రపతి ముర్ముకు అవార్డును అందజేయనున్నారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర ప్రముఖులతో పాటు విద్యావేత్తలకు ఎట్ హోమ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.