- వినాయక సాగర్ వద్ద క్లీన్ ఇండియా హెల్త్ ఇండియా
సంగారెడ్డి టౌన్, వెలుగు: చెరువులు, కుంటల్లోని చెత్తను తొలగించడమే లక్ష్యంగా క్లీన్ ఇండియా హెల్త్ ఇండియా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె సంగారెడ్డి లోని వినాయక సాగర్ చెరువు వద్ద పట్టణ అధ్యక్షుడు ద్వారకా రవి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పట్టణంలోని చెరువులు, కుంటలను శుభ్రంచేస్తున్నామన్నారు. పట్టణ వాసులందరికీ స్వచ్ఛమైన నీరు, గాలి అందించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం అన్నారు.
కార్యక్రమంలో రాజేశ్వరరావు దేశ్పాండే, అధికార ప్రతినిధి రాజ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజ్, రాజశేఖర్ రెడ్డి, విజయకుమార్, నాగరాజ్ ,శ్రీనివాసరెడ్డి ,శివ, అజయ్ , లింగమూర్తి, గురునాథ్ , తులసి రెడ్డి, తేజస్విని, లక్ష్మి , సుబ్బలక్ష్మి , ప్రవీణ, రవీందర్, శివశంకర్ పాటిల్, రాకేశ్ గౌడ్ , అభి, వెంకట్, సతీశ్, బాలమురళి పాల్గొన్నారు.