వలసదారుల వల్లే మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం:జోబైడెన్

వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో వలసదారులది కీలక పాత్ర అని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్  అన్నారు. వలస విధానాన్ని తాము ప్రోత్సహి స్తుండ డం వల్లే బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని ఆయన చెప్పారు. భారత్, చైనా, జపాన్, రష్యా దేశాలు వలస విధానాన్ని ప్రోత్స హించడం లేదని, అందువల్లే ఆ దేశాల ఆర్థిక వృద్ధి రేటు తక్కువగా ఉందని వ్యాఖ్యానించా రు.

అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం నిర్వహిం చిన ఫండ్ రైజింగ్  కార్యక్రమంలో బైడెన్  మాట్లాడారు. ‘‘చైనా వృద్ధి రేటు ఎందుకు తక్కు వగా ఉంది? జపాన్  ఎందుకు ఎదురీదు తోం ది? రష్యా, భారత్​లో వృద్ధిరేటు ఎందుకు తక్కు వగా నమోదవుతోంది? దీనంతటికీ కారణం ఆ దేశాలు వలస విధానాన్ని ప్రోత్సహించవు. ఇమిగ్రెంట్లు తమ దేశాలకు రావాలని వారు కోరుకోరు. కానీ, మనం మాత్రం వలస విధానా న్ని ప్రోత్సహిస్తుండడంతో అమెరికా వృద్ధి రేటు బాగుంది.

మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడ డంలో వలసదారులది కీలక పాత్ర” అని బైడెన్  చెప్పారు. కాగా, 2024లో ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటులో మందగమనం ఉంటుందని వివిధ సర్వేలు చెప్పినా, భారత వృద్ధిరేటు 6.8 శాతం ఉండవచ్చని అంచనా వేశాయి. అయినప్పటికీ ఇండియా ఆర్థిక వృద్ధి రేటు తక్కువగా ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. ఇక అమెరికాలో ఇమిగ్రేషనే ప్రధాన సమస్య అని గాల్లప్  సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో 27 శాతం మంది అమెరికన్లు పేర్కొన్నారు.