కిర్బి పరిశ్రమలో ఎన్నికలు నిర్వహించాలి..రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున

సంగారెడ్డి టౌన్ , వెలుగు: కిర్బి పరిశ్రమలో గుర్తింపు సంఘానికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఎన్నికల సమయం ముగిసిపోయిన తర్వాత మూడు నోటీసులు పంపినప్పటికీ, లేబర్ ఆఫీస్ లో ఫైనల్ మీటింగ్ వాయిదా వేయడం సరికాదన్నారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. 

ALSOREAD:బీఆర్ఎస్​ ఒక మునిగిపోయే నావ: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాలయాపన చేసే సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని లేబర్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమలో సీఐడీ జిల్లా ఉపాధ్యక్షుడు కే రాజయ్య,  యూనియన్ నాయకులు బీఎస్‌ రాజు, తలారి శ్రీనివాస్, నాగప్రసాద్ ,శంకర్, లక్ష్మణ్, సుధాకర్, మల్లేశ్ , మహేశ్వర్ రెడ్డి, రాములు, ప్రభు, శ్రీనివాస్ పాల్గొన్నారు.