ప్రధాని మోదీని విష్ చేసిన రాష్ట్రపతి : నరేంద్ర మోదీ 74వ పుట్టిన రోజు

ప్రధాని మోదీని విష్ చేసిన రాష్ట్రపతి : నరేంద్ర మోదీ 74వ పుట్టిన రోజు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఆయన చేసే వినూత్న ప్రయత్నాలు సుగమం చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము ఆమె X అకౌంట్ పేర్కొంది. సెప్టెంబర్ 17న మోదీ 74వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.  

ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే కూటమి పక్ష నాయకులు మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ గుజరాత్‌లోని ఒక చిన్న పట్టణంలో సెప్టెంబర్ 17, 1950లో జన్మించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు, ఎన్డీయే కూటమి నాయకులు, పార్టీలకు అతీతంగా కొందరు మోదికి బర్త్ డే విషెస్ చెప్పారు.