ఢిల్లీలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఢిల్లీలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకం ఎగురు వేశారు. త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో హాజరయ్యారు.. గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. 

మరోవైపు గణతంత్ర వేడుకల్లో భాగంగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు ప్రధాని మోదీ,రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  నివాళులర్పించారు. ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా 70వేల మంది పోలీసులు, 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు మోహరించాయి. ఢిల్లీ మొత్తం వేల సంఖ్యలో సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో త్రివిధ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్ర కోట నుంచి రాష్ట్ర పతిభవన్ వరకు సైనిక కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కవాతులో ఇండోనేషియా సైన్యం కూడా పాల్గొన్నది. కర్తవ్య పథ్ లో గణతంత్ర వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. కర్తవ్య పథ్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.