రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2కిలోమీటర్లు నడిచి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ముర్ము ఒడిశా వెళ్లారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో భువనేశ్వర్కు చేరుకున్న ఆమెకు గవర్నర్ గణేశీ లాల్, సీఎం నవీన్ పట్నాయక్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె హెలికాఫ్టర్లో పూరీ క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయానికి కాన్వాయ్లో బయలుదేరగా.. కొంత దూరం వెళ్లాక ముర్ము కాన్వాయ్ని ఆపి.. కాలినడకన ఆలయానికి వెళ్లారు.
దాదాపు రెండు కిలోమిటర్లు నడిచి వెళ్లి జగన్నాథుడిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి అయ్యాక ముర్ము తన సొంత రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇవాళ భువనేశ్వర్లో స్కూళ్లు, ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. శుక్రవారం భువనేశ్వర్లోని మూడు స్కూళ్లు, ఆదివాసీ బాలల ఆశ్రమాన్ని సందర్శించనున్నారు.