బీసీని సీఎం చేస్తామన్న బీజేపీని గెలిపిద్దాం : దాసు సురేశ్

కరీంనగర్, వెలుగు: బీసీని సీఎం చేస్తామన్న బీజేపీని గెలిపిద్దామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్​ పిలుపునిచ్చారు. కరీంనగర్‌‌‌‌లోని బీసీ రాజ్యాధికార సమితి ఆఫీసులో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణకు బీసీని సీఎం చేస్తామని  ముందుకు రావడం హర్షనీయమన్నారు. 

సమావేశంలో రాష్ట్ర మీడియా కన్వీనర్ మారేపల్లి లక్ష్మణ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విఠలేశ్వర్, కార్యదర్శి రజనీకాంత్, లక్ష్మి, శంకరాచారి, రమేశ్, లీడర్లు బండారు పద్మావతి, శ్రీలత, బలరాం, మడత కిశోర్​ పాల్గొన్నారు.