భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసీ హజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన జనవరి 24న ఢిల్లీకి రానున్నారు. ఆ తర్వాతి రోజు ప్రధాని మోడీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. ఈజిప్టు అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌తోనూ సమావేశమం కానున్నారు. రిపబ్లిక్ డేకు పశ్చిమాసియా దేశాల నుంచి.. అరబ్ దేశాల నుంచి వస్తున్న ఐదో చీఫ్ గెస్టుగా అబ్దెల్ ఫతా నిలవనున్నారు.
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈజిప్ట్ నుంచి వచ్చిన 180 మంది సభ్యులతో కూడిన బృందం కూడా పాల్గొననుంది. 75 ఏండ్ల భారత్ - ఈజిప్టు దౌత్య సంబంధాలకు గుర్తుగా పోస్టల్ స్టాంపును విడుదల చేయనున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై నేతలు సంతకాలు చేసే అవకాశం ఉంది.