నారాయణ ఏఐ టూల్ ఆస్ట్రా ఆవిష్కరణ

నారాయణ ఏఐ టూల్ ఆస్ట్రా ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: డిజిటల్  లర్నింగ్ ను మరింత సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్  ‘ఆస్ట్రా’ టూల్ ను ఆవిష్కరించామని నారాయణ విద్యా సంస్థల అధినేత పునీత్  కొత్తప బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రా టూల్ ను తమ స్టూడెంట్లకు అందుబాటులోకి తెచ్చామని ఆయన చెప్పారు. ‘‘ఆస్ట్రా.. ఏఐ ఆధారిత చాట్ బాట్. ప్రశ్నలు అడిగిన 30 సెకన్లలోనే సమాధానాలు అందిస్తుంది.

స్టూడెంట్లు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన డౌట్లను వేగంగా క్లియర్  చేసుకోవడానికి ఆస్ట్రా తోడ్పడుతుంది. ఇప్పటికే దాదాపు 15 వేల మందికి ఇది సేవలందించింది. స్టూడెంట్లకు ఉచితంగా ఈ టూల్  ఇస్తాం” అని పునీత్  తెలిపారు.