- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు: దేశంలో జనగణనతోపాటు కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర బడ్జెట్లో బీసీల అభివృద్ధికి రూ.2లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఈ సందర్భంగా ‘చలో ఢిల్లీ’పోస్టర్ ను ఆవిష్కరించారు.