మోదీని హత్తుకుని భావోద్వేగానికి గురైన ఉక్రెయిన్ అధ్యక్షుడు

మోదీని హత్తుకుని భావోద్వేగానికి గురైన ఉక్రెయిన్ అధ్యక్షుడు

మోదీని చూడగానే కన్నీటి పర్యంతం.. మోదీని హత్తుకుని భావోద్వేగం.. ఇదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హావాభావాలు.. ఉక్రెయిన్ యుద్ధభూమిలో అడుగు పెట్టిన మన ప్రధాని మోదీ.. జెలెన్స్కీ భేటీ అయ్యారు. భారత ప్రధాని మోదీ శుక్రవారం ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని కీవ్ నగరంలో కలిశారు. కీవ్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి మోదీ పూలమాల వేశారు. 

అనంతరం యుద్ధం వల్ల నష్టపోయిన ప్రాంతాల గురించి జెలెన్స్కీ మోదీని వివరించారు. యుద్ధ వాతావరణ దేశాన్ని .. ఫొటోలు చూపిస్తూ.. బాధితుల వేదనను మోదీకి వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆయన.. దీంతో అతన్ని భుజం తట్టి.. వెన్నుతట్టి నేనున్నాను అంటూ మోదీ భరోసా ఇచ్చారు. ఈ ఫొటోలు, వీడియో ఇప్పుడు వైరల్ అయ్యాయి. 

ఇప్పటి వరకూ ఇండియాకు నుంచి ఉక్రెయిన్ సందర్శించిన మొదటి ప్రధాని మోదీయే.. అంతేకాదు జూలైలో మోదీ రష్యాలో పుతిన్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాలను శాంతి చర్చలకు తీసుకువచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోదీ కలిశారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారత్ తన శక్తి మేరకు ప్రయత్నిస్తుందని, సంభాషణ మరియు దౌత్యం ప్రతిదీ కొనసాగిస్తుందని ప్రధాని మోదీ ఆ సమావేశంలో పేర్కొన్నారు.