నస్పూర్, దండేపల్లి, వెలుగు : ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రావు అన్నారు. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ ఆర్అండ్ఆర్ కాలనీలో స్థానిక మహిళలకు స్రవంతి, రఘునాథ్ దంపతులు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నస్పూర్ మున్సిపాలిటీలో సమస్యల పరిషారం బీజేపీతోనే సాధ్యమని, ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ప్రధాని మోదీ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో సత్రం రమేశ్, పానుగంటి మధు, కుర్రె చక్రి, రంగు రమేశ్, పులి కిష్టయ్య, మర్త నారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దండేపల్లి మండలం పాత మామిడిపెల్లిలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల చేతుల మీదుగా మహిళలకు పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు రాజయ్య, ఇన్చార్జ్ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.