
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఒడిశాలో పర్యటిస్తున్నారు. తన రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత వాయుసేన ప్రత్యేక విమానంలో ఆయన భువనేశ్వర్ చేరుకున్నారు.ఈ సందర్భంగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రెసిడెంట్ కోవింద్‌కు గవర్నర్ గణేశి లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో కోవింద్ పూరీకి బయల్దేరనున్నారు.
షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి కోవింద్ సాయంత్రం పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించనున్నారు. వీవీఐపీల దర్శన సమయంలో ఆయన దర్శనం చేసుకోనున్నారు. రేపు( ఆదివారం) శ్రీమద్ భక్తిసిద్ధాంత గోస్వామి ప్రభుపాద్‌కు నివాళులు అర్పించేందుకు కోవింద్ శ్రీ చైతన్య గౌడియా మఠాన్ని సందర్శించనున్నారు. గౌడియా మిషన్ వ్యవస్థాపకుడి 150వ జయంతి సందర్భంగా మూడేళ్లపాటు జరిగే వేడుకలను కూడా ఆయన ప్రారంభిస్తారు.
మరోవైపు పూరీలో రాష్ట్రపతి కోవింద్ పర్యటన నేపథ్యంలో కట్టు దట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన సందర్భంగా యాత్రికుల పట్టణంలో భద్రతా ఏర్పాట్ల కోసం 40 ప్లటూన్ల పోలీసు బలగాలను మోహరించారు.ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశామని, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భక్తులకు, ఇతర నివాసితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నమాన్నారు అధికారులు. రాష్ట్రపతి పూరీకి వెళ్లడం ఇది మూడోసారి. చివరిసారి, అతను తన భార్య సవితా కోవింద్‌తో కలిసి మార్చి 2021లో పవిత్ర పట్టణాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందర్శించారు
President Ram Nath Kovind arrives in Bhubaneshwar, Odisha. pic.twitter.com/FVe4kENQGM
— ANI (@ANI) February 19, 2022
ఇవి కూడా చదవండి: