ఏనుగు ఎక్కి పార్కులో తిరిగిన రాష్ట్రపతి కోవింద్

అస్సాంలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఈ రోజు గౌహతికి చేరుకున్నారు. అక్కడ  కజిరంగా నేషనల్ పార్క్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏనుగుపై సవారీ చేశారు. అంబారి ఎక్కి పార్కులో తిరిగారు. కుటుంబ సమేతంగా ఆయన మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చారు.

శుక్రవారం కోవింద్ తన భార్య,కుమార్తెతో కలిసి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, సీనియర్ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలుకుతూ.. అసోం ప్రభుత్వం విమానాశ్రయం బయట రోడ్డు వెంబడి వివిధ తెగలు, వర్గాల వారితో సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి:

ప్రముఖ సినీనటికి కరోనా పాజిటివ్

రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘అరబిక్ కుతు’ సాంగ్