
పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి భారీ ఫొటో ఏర్పాటుచేశారు. ఈ ఫొటోను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని మోడీ, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. వాజ్ పేయి.. తన జీవితం మొత్తం దేశానికి అంకితం చేశారన్నారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.