ప్రతి ఏడాది శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి భవనానికి వస్తుంటారు.ఇందులో భాగంగానే ఈ నెల 29న సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో రామ్ నాథ్ కోవింద్ బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా దుండిగల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని అక్కడే ఆరు రోజులు ఉంటారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
జనవరి 3వ తేదీ వరకు ..ఆరు రోజుల పాటు రాష్ట్రపతి హైదరాబాద్‌లో ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన మేరకు రహదార్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు సీఈవోకు... సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఆక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి భవన్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు.