జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వుల ప్రకారం జమ్ముకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 సెక్షన్ 73 ద్వారా అందించబడిన అధికారలను ఉపయోగించి 2019 అక్టోబర్ 31న ఇచ్చిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239, 239ఏ సెక్షన్లను రద్దు చేశారు. దీంతో ఆరేళ్ల తర్వాత జమ్ముకాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన రద్దైంది. 

కాగా ఇటీవల జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. అయితే ఈనెల 16న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.