ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన?..కారణం అదేనా?

ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన?..కారణం అదేనా?
  • ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన
  • 4  నుంచి 5 నెలల పాటు విధించే యోచనలో కేంద్రం

న్యూఢిల్లీ: మణిపూర్ సీఎం పదవి నుంచి బీజేపీ నేత ఎన్.బీరెన్ సింగ్ ఆదివారం తప్పుకున్నారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు సమర్పించారు. 

ఈ సందర్భంగా తదుపరి సీఎంను ఎన్నుకునే వరకు ఆ పదవిలో కొనసాగాలని బీరెన్ సింగ్ ను గవర్నర్ కోరారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేనందున ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఆర్టికల్ 356 ప్రకారం రెండు నెలల్లోపు రాష్ట్రపతి పాలన ప్రకటనను ఉభయ సభలు ఆమోదించాలి. అలా చేయని పక్షంలో దాని గడువు ముగిసిపోతుంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రకటనను ఉభయ సభల ముందుకు తీసుకురావడానికి కేంద్రం ఇష్టపడటం లేదు. మణిపూర్లో నాలుగు నుంచి ఐదు నెలల పాటు రాష్ట్రపతి పాలనను విధించాలని కేంద్రం యోచిస్తోంది.