గ్రేటర్లో ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం
గంటల తరబడి ఆన్లైన్ క్లాసులు
విద్యాశాఖకు ఆగని కంప్లయింట్స్
స్క్రీన్ టైమింగ్ పెరిగితే ఇబ్బందంటున్న సైకాలజిస్టులు
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ క్లాసులు స్టూడెంట్స్ , పేరెంట్స్ పై మానసిక ఒత్తిడి పెంచుతున్నాయి. వాటితో పిల్లలకు ఉపయోగం లేదని, ఎక్కువ ఫీజుల వసూలు చేస్తున్నారని విద్యాశాఖకు తల్లిదండ్రుల నుంచి కంప్లయింట్స్ వెళ్తూనే ఉన్నా… ప్రైవేట్ స్కూల్స్ తీరు మారడం లేదు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ (ఎంహెచ్ఆర్డీ) డిజిటల్ ఎడ్యుకేషన్పై ఇటీవల రిలీజ్ చేసిన ‘ప్రజ్ఞత’ గైడ్ లైన్స్ ని గాలికొదిలేశాయి. గంటల తరబడి క్లాసులు కండెక్ట్ చేయడంతో పాటు టెస్టులు పెడుతున్నాయి. స్క్రీన్ టైమింగ్ పెరగడం వల్ల పిల్లలపై విజువల్గా, మెంటల్గా ఎఫెక్ట్ ఉంటుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
ప్రజ్ఞత గైడ్ లైన్స్ ఏంచెప్తున్నాయి..
కిండర్ గార్టెన్, నర్సరీ, ప్రీ స్కూల్ స్టూడెంట్స్ కి స్క్రీన్ టైం 30నిమిషాలు.
1-8క్లాస్ స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాసుల టేం గంటన్నర.
9-12 క్లాస్ స్టూడెంట్స్ కి 3గంటలు.
ప్రైవేట్ స్కూల్స్ మాత్రం సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ కి రెండున్నర గంటలు లైవ్ ఆన్లైన్ క్లాసులు తీసుకోవడంతో పాటు హోమ్ వర్క్ షీట్స్ ఇస్తున్నాయి. టెస్టులు కండక్ట్ చేస్తున్నాయి. కిండర్ గార్టెన్ నుంచే పిల్లలకు వాట్సాప్ లో అసైన్ మెంట్లు ఇస్తున్నాయి. పేరెంట్స్ మానిటరింగ్ తప్పనిసరిగా మారడంతో పిల్లలతో పాటు తామూ పనులు పక్కనపెట్టి చూసుకోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెప్తున్నారు. జీహెచ్ఎంసీతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి 7వేల ప్రైవేట్ స్కూల్స్ ఉండగా, 15 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. బుక్స్, యూనిఫామ్, ట్యాబ్ లు కొనాలని మేనేజ్మెంట్లు ఒత్తిడికి గురిచేస్తున్నాయి. స్కూల్స్ రీ ఓపెన్ చేయలేదు కాబట్టి ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని జీఓ నం.46 చెప్తుండగా.. ట్రాన్స్ పోర్ట్, ఇంటర్నెట్, లైబ్రరీ, క్యాంటీన్ తదితర ఫీజులూ పే చేయాలంటున్నాయి. దాంతో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేరెంట్స్ సతమతమవుతున్నారు. పలు స్కూళ్ల ఎదుట ఆందోళనకు కూడా దిగారు. విద్యాశాఖ అధికారులకు కంప్లయింట్స్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ కంప్లయింట్ చేసింది. హైకోర్డునూ ఆశ్రయించింది. ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిళ్లపై డైలీ తమకు కంప్లయింట్స్ వస్తున్నాయని హెచ్ఎస్పీఏ జాయింట్ సెక్రటరీ వెంకట్ తెలిపారు.
గాడ్జెట్స్ కి ఎడిక్ట్ కాకుండా చూసుకోవాలి
స్క్రీన్ టైమింగ్ పెరగడం వల్ల పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆన్లైన్ క్లాసులతో గాడ్జెట్స్ కి అలవాటై తర్వాత వాటికి దూరం చేస్తే అగ్రెసివ్ అవుతారు.మళ్లీ మాములుగా స్కూల్ కి వెళ్లి క్లాసులో లెస్సెన్స్ వినడానికి రెడీగా ఉండరు. ఫోకస్, అటెన్షన్ పోతుంది. ఇప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లలను మెంటల్ గా స్ట్రాంగ్ గా చేయాలి. కరోనా పరిస్థితులు చక్కబడితే స్కూల్ కి వెళ్లాల్సి ఉంటుందని గుర్తు చేస్తుండాలి.
– డా.కొసురు సంగీత (సైకాలజిస్ట్)
For More News..