బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆపార్టీ నేత కేటీఆర్ కాంగ్రెస్ నేత విమర్శిస్తున్నారని టీపీసీసీ చీఫ్ అన్నారు. తెలంగాణ ఆదాయం తగ్గిందని కేటీఆర్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా.. ఏ అంశాల్లో తగ్గిందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్లు అప్పుచేసింది.. ఆ అప్పుకు వడ్డీ చెల్లించేందుకు వచ్చే ఆదాయంలో 60 శాతం ఖర్చవుతుందన్నారు.ఇష్టారాజ్యంగా అప్పులు చేసి ప్రజలపై గత ప్రభుత్వం భారం మోపిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతులకు ఉపయోగపడదరి తెలిసినా.. రూ.1.20 వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపార్టీ నేతల జేబులు నింపుకొనేందుకు అనవసరమైన ఖర్చులు పెట్టి.. కమీషన్లు దోచుకున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుటుంబం తప్ప తెలంగాణలో ఏ కుటుంబం బాగుపడలేదన్నారు. కేసీఆర్ పాలనతో విసుగొచ్చిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పగించారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రజాపాలన జరుగుతుందని తెలిపారు.
Also Read : మాకు రక్షణ లేదు.. మమ్మల్ని వదిలేయండి
హైడ్రా విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విమర్శలను తిప్పికొట్టారు. మీ ఎమ్మెల్యేలు కబ్జా చేశారని విమర్శిస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత... కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నిర్మించిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసిందన్నారు. హైడ్రాకు తన, మన బేధాలుండవంటూ.. ఎవరు అక్రమంగా భవనాలు నిర్మించుకున్న కూల్చడమే హైడ్రా ఎజెండా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.