
- మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కామెంట్
దుబ్బాక, వెలుగు: ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం బీఆర్ఎస్తో మూడున్నరేండ్లు పోరాడినా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఎంపీ రఘునందన్‌రావు గుర్తు చేశారు. గురువారం మిరుదొడ్డి మండలంలోని నాగయ్య వాగుపై రూ. కోటితో నిర్మించే బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన చేసి మాట్లాడారు.
బ్రిడ్జి నిర్మాణానికి నిధులివ్వాలని చెప్పులరిగేలా తిరిగినా గత సర్కార్ పట్టించుకోలేదని, నిధులిస్తే ఎమ్మెల్యేకే పేరొస్తదని ఒక్క పైసా ఇవ్వలేదని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తప్పేందని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అంటున్నారని, అప్పుడేమో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వని రోజులుండేవని గుర్తు చేశారు. పదేండ్లు ఎంపీగా ఉండి ప్రభాకర్‌రెడ్డి దుబ్బాకకు ఒక్క పైసా తేలేదని విమర్శించారు.
ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తూ రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. నాగయ్య వాగుపై బ్రిడ్జి నిర్మిస్తే మిరుదొడ్డి రైతుల దశాబ్దాల కల నెరవేరుతుందని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, మాజీ సర్పంచ్ రోశయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు అమర్ నేతలు ఉన్నారు.