గత ప్రభుత్వం ఆర్టీసీని చంపేందుకు కుట్ర చేసింది : మంత్రి పొన్నం

తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీపై వాడీవేడిగా చర్చ సాగుతోంది. గత ప్రభుత్వం ఆర్టీసీని చంపేందుకు కుట్ర చేసిందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ యూనియన్లను గత ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు.  రూ. 280 కోట్ల బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీకి చెల్లించిందని తెలిపారు. కార్మికులపై పని భారం పెరిగిందనే డబుల్ పేమెంట్ ఇస్తున్నామిన తెలిపారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.