విద్యారంగాన్ని గత సర్కార్ ధ్వంసం చేసింది: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

విద్యారంగాన్ని గత సర్కార్ ధ్వంసం చేసింది: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

హైదరాబాద్, వెలుగు: విద్యా రంగాన్ని గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విమర్శించారు. ఇటీవల పల్లెబాటలో భాగంగా స్కూళ్లను చూస్తే చాలా బాధే సిందని తెలిపారు. టాయిలెట్లు మరీ దారుణంగా ఉన్నాయని చెప్పారు. పిల్లల బాధ తలుచు కుంటే చాలా భయమేసిందని పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ జరగగా ఆమె మాట్లాడారు. 

గత ప్రభుత్వం స్కూళ్లను ఎందుకు అలా వదిలేసిందో చెప్పాలన్నారు. కానీ, గత సర్కారు చేయలేనిది తమ ప్రభుత్వం చేసి చూపిస్తున్నదని వెల్ల డించారు. స్కూళ్లను బాగు చేస్తు న్నదని, బడ్జెట్​లో రూ.21 వేల కోట్లు పెట్టడమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వివరించారు.