హైదరాబాద్: కాంగ్రెస్ఇచ్చిన మాటకు కట్టుబడి సీపీఎస్ ను తొలగించాలని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు.ఉద్యోగుల జేఏసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఇప్పటివరకు 4డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఉద్యోగుల అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే సన్మాన సభను నిర్వహిస్తామన్నారు. ఇవాళ సమావేశంలో జేఏసీలో 27 సంఘాలతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నట్లుగా ఆయన తెలిపారు. సెప్టెంబర్1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టాలన్నారు.