Gold Rate: కొనేటట్టే లేదు..ఒక్కరోజే రూ.1,100 పెరిగిన బంగారం ధర

Gold Rate: కొనేటట్టే లేదు..ఒక్కరోజే రూ.1,100 పెరిగిన బంగారం ధర

న్యూఢిల్లీ:గోల్డ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో శుక్రవారం రూ.1,100 ఎగిసి జీవిత కాల గరిష్టమైన రూ.84,900కి చేరుకుంది. ఇండియాలో గోల్డ్​కు డిమాండ్ బాగుందని, గ్లోబల్ అంశాల కారణంగా ధరలు పెరుగుతున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. 

గత నెల రోజుల్లో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.5,510 (7 శాతం) పెరిగింది.  వెండి ధరలు కేజీకి రూ.850 పెరిగి రూ.95,000 కు చేరుకుంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,310  పెరిగి రూ.84,330 ని టచ్ చేయగా, వెండి రేటు  కేజీకి రూ.1,000  పెరిగి  రూ.1,07,000  పలుకుతోంది.