సింపుల్గా ఉందనుకున్నారు కదా.. టీ షర్ట్ ధర తెలిస్తే షాకవుతారు

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu).. ఈ పేరు వింటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలు ఊగిపోతాయి. ఆడియన్స్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది మరి. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే.. అప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బద్దలైపోవాల్సిందే. రికార్డ్స్ బ్రేక్ చేయడమే కాదు.. కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలన్నా ఆయనతోనే సాధ్యం. అందుకే ఆయన చేసిన చిన్న పనైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. 

తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు మహేష్ బాబు. కారణం ఆయన ధరించిన టీ షర్ట్. అవును ఆయన ఇటీవల యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నిజానికి ఇలాంటి ఫంక్షన్స్ కు చాలా సింపుల్ గా వస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చాలా సింపుల్ గా వచ్చారు. పింక్ కలర్ రౌండ్ నేక్(ట్ షర్ట్) వేసుకొని వచ్చారు. అది చూసిన ఆడియన్స్ షాకయ్యారు. మహేష్ బాబు ఏంటి మరీ ఇంత సింపుల్ గా వచ్చారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. 

అయితే తాజా సమాచారం మేరకు యానిమల్ ఈవెంట్ ఆయనేమి సింపుల్ గా రాలేదు. ఆయన ధరించిన టీ షర్ట్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు ధరించిన ఆ స్లిమ్ ఫిట్ టీ-షర్ట్ కాటన్ విత్ 4జీ ఎబ్రాయిడరీ ఖరీదు రూ.47,000 అట. ఈ విషయం తెల్సిన నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. మహేష్ బాబు చాలా సింపుల్ గా వచ్చారనుకున్నాము.. ఆ టీ షర్ట్ ధర 47 వేలా అంటూ కామెంట్స్ చేస్తూ షాకవుతున్నారు.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రానున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.

Also Read :- మా తెలుగువాళ్లు చాలా స్మార్ట్.. బాలీవుడ్ దుమ్మురేపుతారు.. మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ వైరల్