వామ్మో ఇదేంటి.. ఫోన్‌కు ఇంత రేటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజం.. ఈ ఫోన్‌కు అక్షరాల రూ. 11.3 లక్షలు (15,860 డాలర్లు). ఐఫోన్ 11 ప్రో మాదిరిగా పనిచేసే ఈ ఫోన్‌ను కేవియర్ కంపెనీ తయారుచేసింది. ఆపిల్ ఐఫోన్ మరియు టెస్లా సైబర్‌ట్రక్ రెండింటి కలయికే ఈ సైబర్‌ఫోన్. ఈ ఫోన్ అవుట్ లుక్ సైబర్‌ట్రక్‌ను పోలి ఉంటుంది. కానీ, ఫోన్ మాత్రం ఐఫోన్ 11ప్రో లాగా పనిచేస్తుంది. వినియోగదారులు మాత్రం ఇంత ధర ఉన్నా ఆలోచించకుండా కొనడానికే మొగ్గు చూపుతున్నారు.
ఈ సైబర్‌ఫోన్ కేసింగ్‌ను టైటానియంను ఉపయోగించి తయారుచేశారు. ఇది ఆపిల్ ఫోన్ యొక్క అల్యూమినియం 7000-సిరీస్ మిశ్రమం కంటే మెరుగైనది. అంతేకాకుండా ఈ ఫోన్ డిస్‌ప్లే కూడా టైటానియంతో చేసిన కటౌట్‌ను కలిగి ఉంటుంది. ఈ సైబర్‌ఫోన్ ఫోల్డింగ్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ ఫోన్ కింద పడ్డా కూడా డిస్‌ప్లే పాడవకుండా ఈ ఫోల్డింగ్ కాపాడుతుంది. ఈ సైబర్‌ఫోన్ కేవియర్ వెబ్‌సైట్‌లో మాత్రమే లభిస్తుంది. కేవలం పరిమిత యూనిట్లలో మాత్రమే లభించే ఈ ఫోన్ కావాలంటే వెంటనే ప్రీ ఆర్డర్ చేసుకోవాల్సిందే.