వివో(Vivo) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్ ధరలో ఈ వీవో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ సరీస్‌లో వీవో T3x 5G, వివో T3 5G స్మార్ట్ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. అయితే T3లైట్ 5G హ్యాండ్సెట్ తక్కువ ధరలో IP64 రేటింగ్‌తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 500mAh బ్యాటరీతో పని చేస్తుంది.
వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు
వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD+ LCD డిస్ప్లే, 90Hz రీప్రెష్ రేట్, 840 nits బ్రైట్నెస్, 269 ppi పిక్సల్ డెన్సిటీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్సెట్ బ్యాక్‌సైడ్ డ్యుయెల్ కెమెరా, f/1.8 అపేచర్ తో 50 MP కెమెరా ఉంటుంది. దీంతోపాటు 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యెండ్ సెట్ f/2.0 అపేచర్ తో 8 MP కెమెరా ఉంటుంది.
ఈ వీవో T3 లైట్ 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ Funtouch OS14 తో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300SOC చిప్ సెట్ ఉంటుంది. 4GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ జత చేయబడింది. అదనం 1TB వరకు మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 6GB వరకు వర్చువల్ గా ర్యామ్‌ను పెంచుకోవచ్చు.
ఇక సెక్యూరిటీ పరంగా చూస్తే.. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టివిటీ కోసం 5G, 4GLTE, 5.4 బ్లూటూత్, WiFi, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు ఈ హ్యాండ్ సెట్ లో ఉన్నాయి.
ధర, సేల్ వివరాలు:
ఈ వివో T3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM వేరియంట్ ధర రూ.10వేల 499. 6GB RAM ధర రూ.11వేల 499 గా ఉంది. జులై 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి వివో, ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం అవుతుంది. వైబ్రెంట్ గ్రీన్, మెజిస్టిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
తొలి రోజు HDFC బ్యాంకు, ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డుపై కొనుగోళ్లకు రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు రూ.299 విలువ చేసే 10W ఛార్జర్‌ను ఉచితంగా పొందవచ్చు. సేల్ ప్రారంభం అయిన రోజు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.