పెరుగుతున్న మిర్చి రేట్లు

వరంగల్​సిటీ, వెలుగు: వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో మిర్చి రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు రూ.100 నుంచి రూ.1,000 ల వరకు ధర పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తేజా రకం క్వింటాకు రూ.18,800లు ఉండగా, మంగళవారం రూ.19,300 పలికింది. 341 రకం మిర్చి రూ.15,500 నుంచి రూ.17 వేలకు పెరిగింది. వండర్​ హాట్​ రకం క్వింటాకు రూ. 17,500 నుంచి18 వేలు పెరిగింది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగుతుందని వ్యాపారులు చెబుతుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.