పసిడి ప్రియులకు షాక్: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు షాక్: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు షాక్..గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు..శుక్రవారం (2024, సెప్టెంబర్ 13న ) ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెంట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ. 68వేల 250 కి చేరింది.. గురువారం నాడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67వేల 500 ఉండగా.. ఏకంగా 12 వందల రూపాయలు పెరిగింది. 

మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74వేల 450 లకు చేరుకుంది. నిన్న  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73వేల 150 లుండగా.. ఏకంగా 13వందల  రూపాయలు పెరిగింది.  

ఇక వెండి విషయానికి వస్తే.. శుక్రవారం (2024, సెప్టెంబర్ 13న) నిన్నధరతో పోలిస్తే 35 రూపాయలు పెరిగింది.. గురువారం తులం (10 గ్రాముల ) వెండి ధర 915 లుగా ఉండగా.. 35 రూపాయలుపెరిగి రూ. 950 కి చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 95వేలకు చేరింది.