- 12 విభాగాల్లో అచీవర్అండ్ఎమర్జింగ్టాలెంట్అవార్డుల అందజేత
మాదాపూర్, వెలుగు : రౌండ్ టేబుల్ఇండియా ఆధ్వర్యంలో ప్రైడ్ఆఫ్తెలంగాణ అవార్డ్స్5వ ఎడిషన్ ఆదివారం ఘనంగా ముగిసింది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి సినీ డైరెక్టర్లు భాస్కర్, అనీష్ కురువిల్లా, జి. నారాయణమ్మ ఇంజనీరింగ్కాలేజీ వైస్ చైర్మన్విద్యారెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. సమాజ అభివృద్ధి, ఎదుగుదల వంటి అంశాలతో కూడిన12 విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అచీవర్అండ్ఎమర్జింగ్టాలెంట్అవార్డులను జ్యూరీ సభ్యులు అందజేశారు.
కళలు, సంస్కృతి, విద్య, వినోదం, ఆరోగ్య సంరక్షణ, ఎన్ జీఓ, రిటైల్, క్రీడలు, స్టార్టప్, ఇన్ఫ్రా, స్టార్ కిడ్స్, స్టార్ మహిళా వంటి అంశాలు ఉన్నాయి. రౌండ్ టేబుల్ ఇండియా ప్రెసిడెంట్ఆదర్శ్ కుమార్ మాట్లాడుతూ.. పాఠశాలల నిర్మాణం, పేద విద్యార్థుల జీవితాలను మెరుగుపరచడమే తమ ముఖ్య ఉద్ధేశమని పేర్కొన్నారు. తెలంగాణకు పేరు, కీర్తి తెచ్చిన వారిని గుర్తించి అవార్డులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రైడ్ఆఫ్ తెలంగాణ అవార్డ్స్కన్వీనర్మణిందర్సింగ్మల్హోత్రా, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.