నార్కట్ పల్లి, వెలుగు : చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో ఆలయ అర్చకులు కలిశారు. బ్రహ్మోత్సవాల పత్రిక, స్వామివారి తీర్థప్రసాదాల సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ను సీఎం ఆవిష్కరించారు.
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాటు చేయాలి..
పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. హైదరాబాద్లో మంత్రులు కోమటిరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వానపత్రిక అంజేశారు. సీఎం, మంత్రులను కలిసినవారిలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఆలయ ఈవో నవీన్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఊషయ్యగౌడ్, నాయకులు ఉన్నారు.