లగచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి పై బదిలీ వేటు పడింది. పరిగి కొత్త డిఎస్పీగా ఎన్.శ్రీనివాస్ ను నియమిస్తూ ఉత్త్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ ఘటనకు సంబంధించి మరి కొంతమంది అధికారులపై వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
కాగా.. లాగచర్ల దాడి ఘటన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య చిచ్చు రేపింది. ఈ ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందంటూ కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కొడంగల్‌లో గిరిజనులు, లంబాడాలకు మేలు జరగకూడదని బీఆర్ఎస్ నేతలు కుట్రపన్నుతున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
ALSO READ | రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ
కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ నేతలకు భరోసా ఇవ్వడం వల్లే కలెక్టర్‌పై దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఖమ్మంలో లంబాడాలైన మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపిన చరిత్ర బీఆర్ఎస్దని.. టెర్రరిస్టుల కన్నా దారుణంగా లంబాడాలపై గత ప్రభుత్వం దమనకాండ సాగించిందని ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు.