![చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై దాడి కేసులో ఒకరు అరెస్ట్..](https://static.v6velugu.com/uploads/2025/02/prime-accused-in-attack-on-chilkur-balaji-temple-head-priest-arrested_giUro0p5vl.jpg)
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. శుక్రవారం ( ఫిబ్రవరి 9, 2025 ) రాఘవరెడ్డి 20మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేశారు.
అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు రాఘవరెడ్డి బ్యాచ్. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు పోలీసులు.
రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని.. అందుకు నిరాకరించగా సదరు వ్యక్తుల తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని.. తనపైనా దాడి చేశారని రంగరాజన్ తెలిపారు. తమపై దాడికి పాల్పడ్డవారితో పాటు పరోక్షంగా వారికి సహకరించినవారిని కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు రంగరాజన్.