కొత్త మంత్రివర్గ సభ్యులకు.. మోదీ తేనిటీ విందు

కొత్త మంత్రివర్గ సభ్యులకు.. మోదీ తేనిటీ విందు

ఢిల్లీ: ప్రధాని మోదీ.. కొత్త మంత్రివర్గ సభ్యులకు తేనిటీ విందు ఇవ్వనున్నారు. 2024, జూన్ 9వ తేదీ ఆదివారం ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే ముందు.. ఏడో లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో మంత్రులుగా ఎంపికైన వారిని మోదీ అభినందించనున్నారు.  ఈ తేనిటీ విందులో పాల్గొనేందుకు బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి లతోపాటు తదితర పార్టీ నేతలు మోదీ నివాసానికి చేరుకుంటున్నారు.

ఈరోజు  సాయంత్రం 7.15 గంటలకు వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు దాదాపు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, కేంద్ర క్యాబినెట్ లో తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి.. ఏపీ నుంచి ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఖరారైనట్లు సమాచారం.  శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు మంత్రి పదవులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు టాక్. ఎంపీ రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ హోదా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు ఎంపీ పెమ్మసానికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.