చేర్యాల్ పెయింటింగ్స్ తయారీ చాలా ప్రత్యేకం

చేర్యాల్ పెయింటింగ్స్ తయారీ చాలా ప్రత్యేకం

న్యూఢిల్లీ: తెలంగాణకు మాత్రమే సొంతమైన చేర్యాల్ పెయింటింగ్స్ తయారీ అద్బుతమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోనే ఈ కళ ఒక ప్రత్యేకమైందని చెప్పారు. దాదాపు 50 ఏండ్లుగా చేర్యాల్ జానపద కళను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో డి.వైకుంఠం చేస్తోన్న కృషి మరవలేనిదని ప్రశంసించారు. ఆదివారం ‘మన్ కీ బాత్ 115’ఎపిసోడ్ లో భాగంగా ప్రధాని దేశ ప్రజలతో మాట్లాడారు.

ఈ సందర్బంగా దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కళలు, వాయిద్యాలు, కాలిగ్రాఫీ ల గురించి ప్రసంగించారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ఎంతోమంది అసాధారణ వ్యక్తులు కృషి చేస్తున్నారన్నారు. ప్రత్యేకంగా తెలంగాణకు చెందిన చేర్యాల్ కళను ముందుకు తీసుకెళ్ళడంలో డీ వైకుంఠం కృషి అద్భుతమన్నారు. ‘చేర్యాల్ పెయింటింగ్స్ సిద్ధం చేసే విధానం చాలా ప్రత్యేకమైంది. ఇది స్క్రోల్ రూపంలో కథలను ముందుకు తెస్తుంది. ఇందులో మన చరిత్ర, పురాణాల పూర్తి సమాచారం లభిస్తుంది.’అని అన్నారు.