ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరం తొలి వార్షికోత్సవం సందర్భంగా అయోధ్య రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగి సరిగ్గా ఏడాది పూర్తి కావడంతో.. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. బాలరాముణ్ని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.
అయోధ్య తొలి వార్షికోత్సవ వేడుకలు శనివారం (11 జనవరి 2025 ) నుంచి సోమవారం వరకు మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తు్న్నారు. వార్షికోత్సవం కావడంతో ఆలయ పరిసరాలు భక్తి భావంతో అలరారుతున్నాయి.
హిందూ క్యాలెండర్ ప్రకారం వార్షికోత్సం శనివారం నిర్వహించాలని పండితులు సూచించడంతో.. అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది యూపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్ లల్లా విగ్రహానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
दिव्य दर्शन कीजिए प्रभु श्री राम लला सरकार 🙏🌿 pic.twitter.com/lR8yCrdR1K
— Ayodhya Darshan (@ShriAyodhya_) January 11, 2025
వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు భారీగా తరలి వచ్చారని, దాదాపు లక్షన్నర భక్తులు ఇప్పటి వరకు దర్వించుకున్నారని ఆలయ పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. భక్తుల సంఖ్య క్రమేపి పెరగవచ్చునని తెలిపారు.
అయోధ్య రామమందిర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాలుగా ఎన్నో త్యాగాలు, పోరాటల ఫలితంగా రామ మందిరం నిర్మిచుకున్నామని, ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
दिव्य दर्शन कीजिए प्रभु श्री राम लला सरकार 🙏🌿 pic.twitter.com/lR8yCrdR1K
— Ayodhya Darshan (@ShriAyodhya_) January 11, 2025