![కేజ్రీవాల్ నుంచి విముక్తి..ఢిల్లీ ప్రజలకు పండగ:ప్రధాని మోదీ](https://static.v6velugu.com/uploads/2025/02/prime-minister-modi-has-said-that-freedom-from-kejriwal-celebration-for-people-of-delhijpg1_ReW89sxQ5h.jpg)
ఆప్ నుంచి..కేజ్రీవాల్ నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి లభించిందన్నారు ప్రధాని మోదీ. ఇది ఢిల్లీ ప్రజలకు పండగ రోజు అన్నారు. ఇంతటి విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు. ఢిల్లీ ప్రజలను ప్రేమను అభివృద్దిలో చూపిస్తామన్నారు.
ఢిల్లీలో బీజేపీ విజయం సామాన్యమైనది కాదు.. ఢిల్లీ వికాస్ , విజన్ కోసం ముందుకెళ్తామన్నారు. ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ ను తెచ్చుకున్నారు. ఢిల్లీ ప్రజల సేవకోసమే బీజేపీ ఉన్నదని అన్నారు. ఢిల్లీ ప్రజల భవిష్యత్తు మోదీ గ్యారంటీ అన్నారు.
ALSO READ | Delhi Election 2025: చీపురు చిత్తయింది.. కమలం విరిసింది..
ఆప్ అరాచకాలు.. ఆడంబరాలకు ఇది అంతం అన్నారు ప్రధాని మోదీ. మూడో సారి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాం. మోదీ గ్యారంటీలను ఢిల్లీ ప్రజలు నమ్మారు.. షార్ట్ కట్ రాజకీయాలకు షాకిచ్చి ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ ను తెచ్చుకున్నారని ప్రధాని మోదీ అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. మొత్తం70 కి పైగా అసెంబ్లీ స్థానాలకు బీజేపీ48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటి 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టబోతుంది.