పోగుళ్లపల్లిలో ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ : వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ 

పోగుళ్లపల్లిలో ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ : వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ 
  • జిల్లా కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్​

మహబూబాబాద్ /కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్​ జిల్లాలోని  కొత్తగూడ మండలం, పోగుల్లపల్లి గ్రామంలో బుధవారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను జార్ఖండ్ నుంచి వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలతో  రూ. 40 కోట్ల వ్యయంతో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కో- ఎడ్యుకేషన్ స్కూల్ నిర్మాణం చేశారన్నారు.  23 మంది టీచర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 500 మంది విద్యార్థులకు విద్యతో పాటు, క్రీడలు, సాంస్కృతిక  కార్యక్రమాలు, విద్యార్థుల నైపుణ్యలను వెలికి తీయడానికి అత్యుత్తమమైన విద్య  అందించేందుకు కృషి చేస్తామన్నారు.

విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏటూరు నాగారం ప్రాజెక్టు డైరెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్​  కలెక్టర్   డేవిడ్,ఆర్డీవో అలివేలు, మండల ప్రత్యేక అధికారి సురేశ్ , జిల్లా పరిషత్ సీఈవో నర్మద, ఆర్సివో హరి సింగ్, ప్రిన్సిపాల్ అజిత్ కుమార్ సింగ్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.