తెలంగాణకు ప్రధాని మోదీ తీవ్ర అన్యాయం

తెలంగాణకు ప్రధాని మోదీ తీవ్ర అన్యాయం
  • షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ నేతలు రఘు, బాబర్ ఖాన్ 

షాద్ నగర్,వెలుగు: ప్రధాని మోదీ కుర్చీ కాపాడుకునేందుకే కేంద్ర బడ్జెట్ లో బీహర్, ఏపీకి తప్ప మరే రాష్ట్రానికి కేటాయింపులు చేయాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ నేతలు బాబర్ ఖాన్ బాబర్, పి.రఘు విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించినట్టు కనిపిస్తుందని, తొలి నుంచే ప్రధాని మోదీ వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు.  

పోలవరం నిర్మాణానికి కేటాయింపులు చేసినప్పుడు, తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలోని తెలంగాణను మాత్రం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కు నిధులు కేటాయింపులో పూర్తిగా విఫలమైన ఎంపీలు వెంటనే ప్రధాని మోదీని నిలదీయాలని సూచించారు. రాష్ట్రానికి నిధులు తేనప్పుడు 8మంది బీజేపీ ఎంపీలు ఎందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు.