ఎయిర్​పోర్టులతో సమానంగా రైల్వేస్టేషన్ల అభివృద్ధి : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

ఎయిర్​పోర్టులతో సమానంగా రైల్వేస్టేషన్ల అభివృద్ధి : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు : ప్రధాని మోడీ పాలనలో ఎయిర్ పోర్టులతో సమానంగా రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. వన్ రైల్వే స్టేషన్.. వన్​ప్రొడక్ట్​తోపాటు పలు అభివృద్ధి పనులను మంగళవారం ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభించారు. కామారెడ్డి రైల్వే స్టేషన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ వన్​స్టేషన్..​ వన్​ ప్రొడక్ట్ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.  ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ టీచర్లు సమయపాలన పాటించాలి..

ప్రభుత్వ టీచర్లు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కామారెడ్డి ఎమ్మెల్యే  వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. తన క్యాంపు కార్యాలయంలో డీఈవో రాజు,  ఎంఈవోలు, కాంప్లెక్స్​స్కూల్​హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.