
అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటీ అయ్యారు. మోదీతో పాటు విదేశాంగ శాఖ మంత్రిజై శంకర్, అజిత్ దోవల్ ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు,సుంకాలు, వాణిజ్యంపై చర్చలు జరిగాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక మోదీ భేటీ కావడం ఫస్ట్ టైం.
స్నేహితుడితో కలవడం సంతోషంగా ఉందన్నారు మోదీ. తనలాగే ట్రంప్ కు కూడా దేశమే ఫస్ట్ నినాదం అని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయన్నారు. అమెరికా, భారత్ బంధం మరింత బలోపేతం కావాలన్నారు మోదీ. మరో నాలుగేళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. భారత్ ఎపుడూశాంతినే కోరుకుంటుందన్నారు మోదీ.
Also Read :- టారీఫ్ లపై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్
చాలా ఏళ్లుగా తనకు మోదీ స్నేహితుడని అమెరికా అధ్యక్షడు ట్రంప్ అన్నారు. తమ స్నేహాన్ని మరో నాలుగేళ్లు కొనసాగిస్తామన్నారు. ఇరు దేశాల మధ్య ఐక్యత, స్నేహ బంధం ఉన్నాయన్నారు. భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం అన్నారు. తాము ఎవర్నీ ఓడించాలనుకోవడం లేదన్నారు ట్రంప్.