తెలంగాణ ఉపాధ్యాయుడికి మోదీ ప్రశంస

తెలంగాణ ఉపాధ్యాయుడికి మోదీ ప్రశంస
  • గిరిజన భాషల పరిరక్షణకు తొడసం కైలాష్ సాయం
  • ఏఐతో 'కొలామి'లో సాంగ్ కంపోజ్
  • మన్ కీ బాత్‌లో అభినందించిన ప్రధాని మోదీ

ఢిల్లీ: తెలంగాణలో ఓ ఉపాధ్యాయుడి కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీని వినియోగించుకొని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ఏటా పురోగతి సాధిస్తున్నామన్నారు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేయడం దేశానికే గర్వకారణం అని కొనియాడారు. 

ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన కీ బాత్'లో మోదీ మాట్లాడారు. 'ఇటీవల ఏఐ సదస్సులో పాల్గొనేందుకు పారిస్ వెళ్లాను. ఏఐలో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించింది. తాజాగా తెలంగాణ ఆదిలాబాద్ లోని సర్కాస్ స్కూల్స్ లో పనిచేసే ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ గిరిజన భాషలను పరిరక్షించడంలో మాకు సాయం చేశారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కంపోజ్ చేశారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక రోజు తన సోషల్ మీడియా ఖాతాను వారికే అంకిత చేస్తం..' అని మోదీ తెలిపారు.