బీజేపీ పాలనలో అద్భుత ప్రగతి, దేశ ప్రజల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు ప్రధాని మోదీ. పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఐదేళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఐదేళ్లలో దేశంలో ఉత్పాదకత భారీగా పెరిగిందని చెప్పారు.
కరోనా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని దేశ ప్రజలను కాపాడామన్నారు. కరోనా సమయంలో ఎంపీలు తమ జీతాను ప్రజలకిచ్చి వారిలో ఆత్మవిశ్వాసం పెంచారని ప్రధాని మోదీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించామన్నారు మోదీ.
రీఫార్మ్స్, ఫర్ఫార్మ్స్ , ట్రాన్స్ పార్మ్స్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. జీ 20 సమావేశాలకు దేశం అధ్యక్షత వహిచడం ద్వారా దేశ ప్రతిష్ట విశ్వవ్యాప్తమైందని.. ఇది గర్వించదగిన విషయమన్నారు ప్రధాని మోదీ.
దేశంలో ఎన్నో విపత్తులు ఎదురైనా అభివృద్ధి ఆగలేదన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాద నిర్మూలన చర్యలతో కాశ్మీర్ లో శాంతియుత వాతావరణ నెలకొందన్నారు మోదీ. పేపర్ లీక్ వంటి సమస్యలు రాకుండా కఠినమైన సమస్యలు తీసుకొచ్చామన్నారు ప్రధాని. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. ఎన్ని విపత్తులు వచ్చినా దేశంలో అభివృద్ది ఆగలేదన్నారు ప్రధాని మోదీ.